Saturday, 4 May 2013

జిగురు చిక్కుడు సాగు వివరములు 



                                ఈ పంటను రాజస్తాన్ , గుజరాత్ ల లో విరివిగా  పండిస్తున్నారు. గత కొన్ని సంవత్సరము ల  నుండి   పరిశ్రమలలో దీనిని వాణిజ్యపరంగా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు . ఈ విత్తనములలోని  గలక్టొమన్నస్  అను జిగురు అనేక రంగాలలో ఉపయోగిస్తున్నారు. ఈ జిగురు పదార్ధాన్ని కాగితము, వస్త్రము ,బేకరీ, గనులు, మెడిసిన్ , పెట్రోలియం బావులు తవ్వడం లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కావున దీనిని ఎక్కువగా విదేశాలకు ఎగుమతి చేసి మన దేశానికీ విదేశి మారక ద్రవ్యము  వచ్చేటట్లు చేయుచున్న  పంట. 2012 - 2013 సంవత్సరములో  అత్యధికముగా Rs. 32000/- కింట్వాల్  ధర వచ్చినది. కావున చాలామంది రైతులు ఈ పంట మిద ఆసక్తిని కలిగి ఉన్నారు.




                                     







                      ఈ పంటలో తెగుళ్ళ  బెడద లేదు, తకువ పెట్టుబడి తో ఎక్కువ  సంపాదించవచ్చును. 10 ఎకరాలకు పడే శ్రమ, పెట్టుబడితో 50 ఎకరాలను సాగుచేయ్యవచ్చును. నేడు ఈ పంట బాగా ప్రాచుర్యం పొంది ఎక్కువగా మార్కెటింగ్ సదుపాయాలను కలిగి ఉన్నది. వ్యాపారులు రైతుల వద్ద కే వచ్చి పంటను కొనుగోలు చేయ్యుచున్నారు.

                                               ఈ పంటలో నీటి అవసరము చాల తక్కువ   గా  ఉండును. 3, 4 తడులు లేదా వానలతో ఈ పంటలో పూర్తిగా దిగుబడులను సాధించవచ్చును. నేడు మేలైన రకాలతో అన్ని కాలాలలోనూ ఈ పంటను సాగు చెయ్యవచ్చును.ముఖ్యముగా మన రాష్ట్రంలో జూన్ మొదటి వారం లోపు విత్తి ఆగష్టు చివరి లోపు కోతకు వచ్చునట్లు చెయ్యవలెను. మరల 2 వ పంటగా జనవరి మొదటి వారం లో విత్తి మార్చి లేదా ఏప్రిల్  చివరి లోపు కోతకు వచ్చునట్లు చెయ్యవలెను. ఈ విధంగా సంవత్సరం లో 2 పంటలు  తక్కువ నీరు, తక్కువ శ్రమ మరియు తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభాలను పొందవచ్చును. పంట కోత సమయములో వాన లేకుండ చూచుకోనవలయును, లేనిచో గింజ క్వాలిటీ తగ్గి ధర తకువగా వచ్చును. పంట ప్రారంభం నుంచి మొదటి 40 రోజులు కలుపులేకుండా  చూడవలయును. లేనిచో 40 నుండి 60 % వరకు దిగుబడి తగ్గును. ఈ పంట లో 4 నుండి 8 కింట్వాల్ ల వరకు దిగుబడి సాధించవచ్చును.

ఈ పంటను 3 పద్దతులలో సాగు చెయ్యవచును. అవి ఏవనగా

1. వెదజల్లే పద్ధతి .
2. వరుస లలో విత్తడం.
3. జంట  వరుస లలో విత్తడం.

                                 ఈ మూడు పద్దతులలో  ఎవరికి  అనువైన పద్దతిని  వారు అనుసరించవచ్చును. ఈ  విత్తనాలలో అనేక రకములు ఉన్నపటికి  వీటిని 2 రకాలుగా విభజించవచ్చును.    అవి

1. నేరుగా పెరుగు రకము ,


 2. ప్రక్క కొమ్మలతో పెరుగు రకము.




                               ప్రతి రకము నేల, నీటి తడులు, రకమును బట్టి 90 నుండి 110 లేదా 120 రోజులలో కోతకు వచ్చును.  పై  3 సాగు పద్దతులను మొహిఅగ్రొస్.కామ్ (mohiagros.com ) వారి Vcd లలో చూడవచ్చును. 



నేలలు  :
                నీరు  నిలబడని ,చవుడు భూములు  తప్ప అన్ని రకాల నేలలలో పండించవచ్చును. 

నీటి వసతి :
                  నల్లరేగడి లో 2,3 తడులు సరిపోవును, ఎర్ర , తేలికపాటి నేలలలో 4,5   తడులు అవసరము అగును.

ఎరువులు  :
                            మంచి సారవంతమైన నేలలలో  (1/2) సగం బస్తా D.A.P  ను , మిగతా నేలలలో  ఒక బస్తా D.A.P  ను వాడవలెను. జింకు సల్ఫేటు  10 kg  లు ఎకరమునకు వేసినచో  పూర్తిగా దిగుబడులు వచ్చును, లేదా 15, 30 , 40 రోజులలో జింక్ కలిగిన పోషకాన్ని  స్ప్రే  చేసి మంచి దిగుబడులను సాదించ వచ్చును.

కలుపు   :  

                        ఈ పంటలో మొదటి 30 నుండి 40 రోజుల వరకు కలుపు లేకుండా చేసుకోన్నచో  అధిక దిగుబడులు సాదించవచ్చు. దీని కొరకు మనము విత్తనం  విత్తిన మరుసటి రోజు లేదా అదే రోజు పదును / తేమ ఉన్నప్పుడే అత్రాజిన్  అను కలుపు మందు ను 1. లిటరు  ఎకరమునకు స్ప్రే చేసి మొదటి 20 రోజులు కలుపు లేకుండా చెసుకొనవచ్చును. తరువాత 30 లేదా 40 వ రోజు కూలీలతో లేదా వరుసలలో నాగలి తోలి కలుపు నివారించాలి.


విత్తన శుద్ధి :

                       మొహిఅగ్రొస్.కామ్ (mohiagros.com) వారి విత్తనాలు విత్తన శుద్ధి చెయ్యబడి ఉంటాయి, కాబట్టి మరలా చెయ్యనవసరం లేదు. ఈ మందు ప్రభావం వలన మొదటి 30 రోజులు పంటను పురుగులనుండి రక్షించబడుతుంది.




 విత్తనములు నాటుట :
           ఈ పంటకు 5 నుండి 8 kg  ల వరకు విత్తనమును వాడవచ్చును.

1. వెదచల్లె పద్దతి  :
                                ఈ పద్ధతి  లో నేలను 2, 3 సార్లు మెత్తగా దున్ని నేలలో మంచి పదును ఉన్నప్పుడు సగం బస్తా D.A.P ని దుక్కి లో వేసుకోవాలి. 7 నుండి 8 kg  ల విత్తనాన్ని వెదచల్లి పైన ట్రాక్టర్ గొర్రు తో దున్ని, దిండు తో చదును చెయ్యవలెను. తరువాత రోజు కాని అదే రోజు కాని కలుపు నివారణ మందు ను  ( అత్రాజిన్ ) ను ఎకరాకు 1.5 లీటర్లను  నీటి లో కలిపి పొలం అంతట తడిచేటట్లు స్ప్రే చెయ్యవలెను.



ఈ వెదచల్లు పద్దతిలో కలుపు మందును తప్పని సరిగా వాడవలెను. లేనిచో కలుపు తీయుటకు కూలీల ఖర్చు ఎక్కువ అగును. తరువాత 30 రోజుల అప్పుడు ఒకసారి కూలీల ద్వార కలుపును తీయించవలెను. 30 to 40 రోజుల మధ్యలో సగం బస్తా D.A.P  ని పొలంలో చల్లి పొలానికి నీరు పెట్టవలెను. లేదా ఆ రోజులలో వర్షం పడినప్పుడు మాత్రమే D.A.P  చల్లవలెను. ఈ పంటకు ఎటువంటి తెగుళ్ళు ఇప్పటి వరకు లేవు, దోమపోటు, ఇతర పురుగుల నుండి పంటను కాపాడుటకు 40 నుండి 50 రోజుల వయ్యసు అప్పుడు ఒక సారి ఎసిఫేట్  లేదా క్లోరిపైరిఫాస్ లేదా   కినాల్ఫాస్ ను స్ప్రే చెయ్యవలెను.




 గింజ, పూత సమయంలో  40 to 75 రోజులలొ నేలలో  తేమ ఉండునట్లు చూచుకొన వలెను. ఈ పంట బెట్ట ను తట్టుకోగలదు, వేసవి కాలంలో తప్పని సరిగా నీటి తడులు ఇవ్వవలసి ఉంటుంది. 80 నుండి 90 రోజులప్పుడు నేలలో తడి లేకుండా పంటను వదిలివేయవలెను. పంట మొత్తం ఎండి పోయినట్లుగా ఉండి , సగం ఆకులూ వాడిపోయినట్లుగా ఉన్నప్పుడు పంట కోతకు సిద్ధం గా ఉన్నట్లు భావించవలెను. పంటను కోసి ఎండలో ఆరబెట్టి విత్తనాలను వేరు చేసి  భద్రపరచవలెను.  ఈ పంట కాయలు చెట్టు కు కింద నుండి ఉండును, కావున తక్కువ ఎకరాలలో అయితే కూలీలతో కోపించి ఎండబెట్టి  తరువాత వాటిని తూర్పార యంత్రం లేదా ట్రాక్టర్ తో తొక్కించి విత్తనాలను వేరు చేసి భద్రపరచవలెను, అదే ఎక్కువ ఎకరాలలో సాగు చేసిన రైతులు హర్వేష్టర్  యంత్రం ద్వార కోపించి, యంత్రం వదిలి వేసిన కాయలను కూలీల ద్వార యంత్రం వెనుకగా ఏరించి అదే యంత్రం లో వేసి  విత్తనాలను వేరు చేసి విత్తనమును    భద్రపరచవలెను.


వరుసలలో నాటు పద్దతి :       ఈ పద్ధతి లో నేలను 2,3 సార్లు మెత్తగా దున్ని నేలలో పదును ఉన్నపుడు ట్రాక్టర్ సీడ్ కం ఫెర్టిలైజెర్  డ్రిల్లర్  లేదా ఎద్దులతో వరుసలలో విత్తనాలను విత్తుకోవాలి.













ఈ పద్ధతి లో ఎకరాకు 5 నుండి 6 kg  ల విత్తనం అవసరం ఉంటుంది. 1/2 బస్తాను ఈ యంత్రం లోనే వేసి విత్తనం తో పాటే వెయ్యవచ్చును. ఈ వరుస పద్ధతి  లో  వరుసకు వరుసకు మధ్యలో సరవంతమైన నేలలో 60 cm , తేలిక నేలల్లో 45 cm  ఉండునట్లు చూచుకోనవలెను. మొక్కకు మొక్కకు మధ్య 10 cm  ఉండునట్లు విత్తనాలను 1 నుండి 2 cm  లోతు లో విత్తవలెను. మొలకేత్తిన 10 రోజులకు ఎక్కడైనా మొక్కలు ఎక్కువగా, వత్తు ఉంటె పలుచన చెయ్యవలెను. 15 నుండి 20 రోజులలో ఒకసారి ఎద్దులు  లేదా మినీ టిల్లర్  సహాయముతో వరుసల మధ్య దున్ని కలుపు లేకుండా చెయ్యవలెను.






మరల 30 నుండి 45 రోజులలోపు సగం బస్తా D.A.P  ను వరుసలలో వేసి ఎద్దులు  లేదా మినీ టిల్లర్  సహాయముతో వరుసల మధ్య దున్ని కలుపు లేకుండా చెయ్యవలెను. దుక్కి లో జింక్ వెయ్యని చో  40నుండి 50 రోజుల మధ్యలో ఒకసారి జింక్ కలిగిన పోషకాన్ని  స్ప్రే  చేసి మంచి దిగుబడులను సాదించ వచ్చును.  గింజ, పూత సమయంలో  40 to 75 రోజులలొ నేలలో  తేమ ఉండునట్లు చూచుకొన వలెను. ఈ పంట బెట్ట ను తట్టుకోగలదు, వేసవి కాలంలో తప్పని సరిగా నీటి తడులు ఇవ్వవలసి ఉంటుంది. 80 నుండి 90 రోజులప్పుడు నేలలో తడి లేకుండా పంటను వదిలివేయవలెను. పంట మొత్తం ఎండి పోయినట్లుగా ఉండి , సగం ఆకులూ వాడిపోయినట్లుగా ఉన్నప్పుడు పంట కోతకు సిద్ధం గా ఉన్నట్లు భావించవలెను. పంటను కోసి ఎండలో ఆరబెట్టి విత్తనాలను వేరు చేసి  భద్రపరచవలెను.  ఈ పంట కాయలు చెట్టు కు కింద నుండి ఉండును, కావున తక్కువ ఎకరాలలో అయితే కూలీలతో కోపించి ఎండబెట్టి  తరువాత వాటిని తూర్పార యంత్రం లేదా ట్రాక్టర్ తో తొక్కించి విత్తనాలను వేరు చేసి భద్రపరచవలెను, అదే ఎక్కువ ఎకరాలలో సాగు చేసిన రైతులు హర్వేష్టర్  యంత్రం ద్వార కోపించి, యంత్రం వదిలి వేసిన కాయలను కూలీల ద్వార యంత్రం వెనుకగా ఏరించి అదే యంత్రం లో వేసి  విత్తనాలను వేరు చేసి విత్తనమును    భద్రపరచవలెను.



జంట వరుసల పద్దతి  :
                                          ఈ పద్ధతి లో నేలను 2,3 సార్లు మెత్తగా దున్ని నేలలో పదును ఉన్నపుడు ట్రాక్టర్ సీడ్ కం ఫెర్టిలైజెర్  డ్రిల్లర్  లేదా ఎద్దులతో వరుసలలో విత్తనాలను విత్తుకోవాలి.


ఈ పద్ధతి లో ఎకరాకు 6 నుండి 8 kg  ల విత్తనం అవసరం ఉంటుంది. 1/2 బస్తాను ఈ యంత్రం లోనే వేసి విత్తనం తో పాటే వెయ్యవచ్చును. ఈ జంట  వరుస పద్ధతి  లో  జంట వరుసకు వరుసకు మధ్యలో  60 cm , జంట వరుస లో 15 cm  ఉండునట్లు చూచుకోనవలెను. మొక్కకు మొక్కకు మధ్య 10 cm  ఉండునట్లు విత్తనాలను 1 నుండి 2 cm  లోతు లో విత్తవలెను. మొలకేత్తిన 10 రోజులకు ఎక్కడైనా మొక్కలు ఎక్కువగా, వత్తు ఉంటె పలుచన చెయ్యవలెను. 15 నుండి 20 రోజులలో ఒకసారి ఎద్దులు  లేదా మినీ టిల్లర్  సహాయముతో జంట వరుసల మధ్య దున్ని కలుపు లేకుండా చెయ్యవలెను.
మరల 30 నుండి 45 రోజులలోపు సగం బస్తా D.A.P  ను జంట వరుసలలో వేసి ఎద్దులు  లేదా మినీ టిల్లర్  సహాయముతో జంట వరుసల మధ్య దున్ని కలుపు లేకుండా చెయ్యవలెను. దుక్కి లో జింక్ వెయ్యని చో  40నుండి 50 రోజుల మధ్యలో ఒకసారి జింక్ కలిగిన పోషకాన్ని  స్ప్రే  చేసి మంచి దిగుబడులను సాదించ వచ్చును.  గింజ, పూత సమయంలో  40 to 75 రోజులలొ నేలలో  తేమ ఉండునట్లు చూచుకొన వలెను. ఈ పంట బెట్ట ను తట్టుకోగలదు, వేసవి కాలంలో తప్పని సరిగా నీటి తడులు ఇవ్వవలసి ఉంటుంది. 80 నుండి 90 రోజులప్పుడు నేలలో తడి లేకుండా పంటను వదిలివేయవలెను. పంట మొత్తం ఎండి పోయినట్లుగా ఉండి , సగం ఆకులూ వాడిపోయినట్లుగా ఉన్నప్పుడు పంట కోతకు సిద్ధం గా ఉన్నట్లు భావించవలెను. పంటను కోసి ఎండలో ఆరబెట్టి విత్తనాలను వేరు చేసి  భద్రపరచవలెను.  ఈ పంట కాయలు చెట్టు కు కింద నుండి ఉండును, కావున తక్కువ ఎకరాలలో అయితే కూలీలతో కోపించి ఎండబెట్టి  తరువాత వాటిని తూర్పార యంత్రం లేదా ట్రాక్టర్ తో తొక్కించి విత్తనాలను వేరు చేసి భద్రపరచవలెను, అదే ఎక్కువ ఎకరాలలో సాగు చేసిన రైతులు హర్వేష్టర్  యంత్రం ద్వార కోపించి, యంత్రం వదిలి వేసిన కాయలను కూలీల ద్వార యంత్రం వెనుకగా ఏరించి అదే యంత్రం లో వేసి  విత్తనాలను వేరు చేసి విత్తనమును    భద్రపరచవలెను.                                  



జొధ్ పూర్   మండి  ( రాజస్తాన్ )







ఈ సాగు వివరములు రైతుల కు ఉపమోగపడుతుందని  మేము చేసిన చిన్న ప్రయత్నం, దీని కోసం  చాల మంది ఆలోచనలను మేము క్రోడీకరించి చాల వరకు తప్పులు లేకుండా ఈ బుక్లెట్ ను రూపొందించాము . దీని సహాయము తో ఎవరిమీద ఆధారపడకుండా జిగురు చిక్కుడు సాగును చేసి లాభాలను ఆర్జిస్తారని మనసారా కోరుకుంటూ


మీ 

మొహిద్దిన్  sk  

మోహి  అగ్రోస్ . కామ్ (mohiagros.com )



కిసాన్ వర్ష 
ఆటోమేటిక్ గా నీటిని వర్షం లాగా కురిపించే యంత్రము
                              

                                                  యంత్రాన్ని మెట్ట  పైర్లకు వాడి మంచి దిగుబడులను సాధించవచ్చును యంత్రము తో 20 ఎకరాలకు 1 బోరు తోనే నీటిని పెట్టవచ్చును, కూలీల ఖర్చు ఉండదు,దీని  సహాయముతో పురుగుల మందులను, ఎరువులను కూడా పంటకు అందించవచ్చును. ఒక్క సారి యంత్రమును సమకుర్చుకొంటే  20 సంవత్సరాలు నిరాటంకంగా పనిచేస్తుంది.
                     ఈ యంత్రాన్ని రైతు భూమి కి తగిన విధం గా  డిజైన్ చెయ్యవలసి ఉంటుంది, కావున ధర లో కొంత వ్యత్యాసము ఉండవచ్చునుదీనికి అగు ఖర్చు ఎకరాకు 25 నుండి 35 వేల వరకు ఉండును, యంత్రం పొలం లో ఉంటె సంవత్సరానికి 3 పంటలను అధిక దిగుబడులతో పండించ వచ్చును, కావున రైతు పెట్టె పెట్టుబడి 1 సంవత్సరము లోపలే తిరిగి వచును.
కొన్ని ఉపయోగాలు :
1. భూమి ఎతుపల్లలు ఉన్నను నీటిని పెట్టవచ్చును
2. ఒక్క పంపు తోనే 20 ఎకరాలు సాగు చెయ్యవచును.
3. ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్షం వలే నీటి తడి ఇవ్వవచును
4. యంత్రం తిరిగే స్పీడ్ ను కంట్రోల్ చేస్తూ ఎంత తడి అవసరమో పంటను  బట్టి  అంతే ఇవ్వవచ్చును
5. పంట దిగుబడిలో 20 నుండి 30 % ఎక్కువ పొందవచ్చును
6. పంట 10 నుండి 15 రోజుల ముందుగానే కోతకు వచ్చును
7. నీటి సౌకర్యం తక్కువగా ఉన్న బీడు భూములను పచ్చని పొలాలుగా  మార్చవచ్చును
      యంత్రము కావలసిన వారు / డెమో చూడాలనుకోన్నవారు కాంటాక్ట్ : 9490785649 (రాజేష్